calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శ్రీచైతన్య’ బ్రాండ్ అంబాసిడర్‌గా గుకేశ్ దొమ్మరాజు

11-04-2025 12:58:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): శ్రీచైతన్య ఎడ్యుకేషన్ గ్రూప్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజును నియమించుకుంది. ఈ సందర్భంగా సీఈవో, డైరెక్టర్ సుష్మ బొప్పన మాట్లాడుతూ.. గుకేశ్ దొమ్మరాజు చిన్న వయసులోనే ఆయన సాధించిన విజయాలు పాఠశాల నుంచి జేఈఈ, నీట్ అభ్యర్థులకు ప్రేరణగా నిలిచాయన్నారు.

తమ విద్యాసంస్థల్లో చదవుతున్న విద్యార్థుల సమస్యల పరిష్కారం, విశ్లేషణాత్మక నైపుణ్యాలతో అభివద్ధి చేసేందుకు తాము అంకితభావంతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా గుకేశ్ దొమ్మరాజు మాట్లాడుతూ చదరంగం, పోటీ పరీక్షల్లో విజయం వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుందన్నారు. చదరంగంలో ముందస్తు ప్రణాళిక అవసరమైతే, జేఈఈ, నీట్‌లో విశ్లేషణాత్మక విధానం తప్పనిసరి అని తెలిపారు.

శ్రీచైతన్యతో భాగస్వామ్యం ద్వారా తాను విద్యార్థులకు వారి జీవితాంతం విజయం సాధించేందుకు ప్రేరణ ఇవ్వాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. శ్రీచైతన్యతో కలిసి ఇంజినీరింగ్, మెడిసిన్ మరెన్నో రంగాల్లో భవిష్యత్ ఛాంపియన్లను రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. జేఈఈ, నీట్ చాంపియన్లను అందించే లక్ష్యంతో శ్రీచైతన్య,  ప్రపంచ చెస్ చాంపియన్‌గా గుర్తింపు పొందిన గుకేశ్ జేఈఈ, నీట్ అభ్యర్థుల్లో స్ఫూర్తి కలిగించగలడని ఆ సంస్థ భావిస్తోందని తెలిపారు.