22-04-2025 01:05:53 AM
కోల్‌కతా, ఏప్రిల్ 21: ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 39 పరుగులతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. సాయి సుదర్శన్ (52) అర్థసెంచరీతో మెరిశాడు.
ఆఖర్లో బట్లర్ (41 నాటౌట్) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్, హర్షిత్ రానా, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. అజింక్యా రహానే (50) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరగ నున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.