calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం

19-04-2025 08:12:40 PM

న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.  ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో జోస్ బట్లర్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రూథర్ ఫోర్డ్(43), సాయి సుదర్శన్(36) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లో ముఖేశ్ కుమార్, కుల్ దీప్ యాదమ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఒడి బ్యాటింగ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర పటేల్(39), అశుతోష్ శర్మ(37), కరుణ్ నాయర్(31), ట్రిస్టన్ స్టబ్స్(31), కేఎల్ రాహుల్(28) పరుగులు తీశారు. గుజరాత్  టైటాన్స్ బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ 4, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ,  సాయి కిశోర్ చెరో వికెట్ తీసుకున్నారు.