calender_icon.png 15 April, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

10-04-2025 02:41:38 AM

58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి

అహ్మదాబాద్, ఏప్రిల్ 9: ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. బుధవారం అహ్మదా బాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (82) అర్థశతకంతో చెలరేగగా..

బట్లర్ (36), షారుక్ ఖాన్ (36) రాణించారు. చివర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో గుజరా త్ 200 పరుగుల మార్కును దాటింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో  159 పరుగులకు ఆలౌటైంది.

హెట్‌మైర్ (52), శాంసన్ (41) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లతో మెరవగా.. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.