టైటాన్స్‌కు చావో రేవో
అహ్మదాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.ప్లేఆఫ్స్ ఆశలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ గుజరాత్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో సోమవారం గుజరాత్ తలపడనుంది. ప్లేఆఫ్స్ చేరడంతో ఈ మ్యాచ్‌లో ఓడినా కేకేఆర్‌కు పెద్దగా నష్టం ఉండదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్‌గా నిలవాలని కోల్‌కతా భావిస్తోంది. మరోవైపు గుజరాత్ మాత్రం కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ బ్యాటింగ్ విషయానికి వస్తే చెన్నైతో గత మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. అయితే వీరిద్దరు మినహా మిల్లర్, షారుక్ ఖాన్, తెవాటియా, మాథ్యూ వేడ్‌లు రాణించడంలో విఫలమవుతున్నారు. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లతో బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా మ్యాచ్ మ్యాచ్‌కు మరింత పదునెక్కుతోంది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్‌లు జట్టుకు పెద్ద బలం.అయితే గత మ్యాచ్‌లో వీరిద్దరూ స్థాయికి తగ్గ రీతిలో రాణించలేకపోయినా.. మిడిలార్డర్ జట్టును ఆదుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌లు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. ఫినిషర్ల రూపంలో రసెల్, రింకూ సింగ్‌లు ఉన్నారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, నరైన్‌లో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్, నరైన్ తమ స్పిన్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు.