జైపూర్: దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్, కర్ణాటక, విదర్భ, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ జట్లు డైరెక్టుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఈ జట్లు తమ తమ గ్రూపుల్లో టాప్‌లో ఉండటంతో నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఆదివారం జరిగిన మ్యాచ్ ల్లో చండీగఢ్, తమిళనాడు, విదర్భ, కర్ణాటక, హైదరాబాద్, బరోడా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ముంబై, గుజరాత్, జార్ఖండ్, హర్యానా, అస్సాం, రైల్వేస్, హిమాచల్, సర్వీసెస్ జట్లు విజయబావుటా ఎగరేశాయి.
చెలరేగిన హైదరాబాద్
ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట హైదరాబాదీ బౌలర్లు తనయ్ (5/32), అనికేత్ రెడ్డి (4/14) నిప్పులు చెరగడంతో అరుణాచల్ ప్రదేశ్ 96 పరుగులకే చాపచుట్టేసింది. 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆంధ్రాకు మూడో ఓటమి ఎదురైంది.