calender_icon.png 21 April, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరత నాట్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు హర్షణీయం

21-04-2025 12:00:00 AM

నిర్మల్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : భారత ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వ హించిన భరత నాట్య ప్రదర్శనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్ రికార్డ్ నెలకొల్పిన నాట్య బృందం వారిని బీజేఎల్పీ నేత, నిర్మల్  ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం గారు అభినందించారు.

నిర్మల్ జిల్లా  నృత్యమాల నాట్య అకాడమీలో గురువు అంజలిఆధ్వర్యంలో శిక్షణ పొంది జాతీయ, రాష్ట్ర స్థాయిలో పాల్గొని అవార్డులు పొంద డం హర్షణీయమని కొనియాడారు. చదువుతోపాటు కళా నైపుణ్యాల్లో రాణించాలని అన్నారు. ఇందులో ఎంపీ గోడం నగేష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి తదితరులున్నారు.