calender_icon.png 22 September, 2024 | 11:09 PM

మెగాస్టార్‌ చిరంజీవి నట ప్రస్థానంలో అరుదైన గౌరవం

22-09-2024 08:13:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మెగాస్టార్‌ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది. విభిన్న ఆహార్యం, సినిమాల్లో నటనకుగాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవి చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌, గిన్నిస్ బుక్ ప్రతినిధులు అవార్డును చిరంజీవికి అధికారికంగా ప్రధానం చేశారు. తెలుగు సినీ రంగంలో 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... గిన్నిస్ బుక్ రికార్డ్స్ అనేది తను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ తనకు దక్కినట్లు ఆయన పేర్కొన్నారు. నటనకంటే ముందే ఆయన డ్యాన్స్ కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు డ్యాన్స్ చేసి అందరిని అలరించేవాడని, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు కూడా చిరంజీవి విజయానికి కారకులని చెప్పారు.  దీంతో పలువురు చిరంజీవికి సోషల్ వేదికగా అభినందలు తెలుపుతున్నార. కాగా ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు పేరిట గల జాతీయ అవార్డు చిరంజీవికి దక్కింది. దీనిని అక్టోబర్ 28వ తేదీన అందజేయనున్నారు.