59 కేసులు నమోదు
ముంబై, జనవరి 23: పుణెలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తో బాధపడుతున్నారు. వీరిలో 12 మందికి ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో వెంటిలేటర్లు అమర్చి చికిత్స అందిస్తున్నారు. నగరంలో అకస్మాత్తుగా జీబీఎస్ కేసు లు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జీబీఎస్ కేసులు పెరగడానికి గల కారణాలను పరిశీలించడానికి ఆరోగ్యశాఖ ఓ బృందాన్ని ఏర్పర్చింది.
జీబీఎస్‌తో పక్షవాతం?
అరుదైన నాడీ సంబంధిత డిజార్డర్‌ను జీబీఎస్ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. జీబీఎస్ బాధపడే వాళ్లకు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్యాక్టిరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు జీబీఎస్‌కు దారితీస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.