calender_icon.png 22 September, 2024 | 3:08 AM

జాయింట్ వెంచర్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గదర్శకాలు

22-09-2024 01:19:33 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): రామగుండం థర్మల్ స్టేషన్ బీ స్టేషన్ వద్ద  తెలంగాణ జెన్‌కో, సింగరేణి సంయుక్తంగా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు, డీపీఆర్‌కు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని టీజీ జెన్‌కో సీఎండీకి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. వారం రోజుల్లో మార్గదర్శకాలను సిద్ధం చేసి పంపాలని ఆ లేఖలో కోరారు. గత నెల డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సమీక్ష జరిగింది. ఆ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.. 800మెగావాట్ల బొగ్గు ఆధారిత సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 800మెగావాట్ల థర్మల్ యూనిట్ ఏర్పాటు ఏర్పాటుకు జెన్ కో ముందుకొచ్చింది. జాయింట్ వెంచర్‌లో భాగంగా సింగరేణితో కోఆర్డినేట్ చేసే బాధ్యతలను టీఎస్ జెన్‌కో డైరెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు.