22-02-2025 06:34:15 PM
మోతే,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని రాంపురం తండా గ్రామానికి చెందిన గుగులోతు నరేష్ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ క్రీడలకు(National Level Handball Competitions) ఎంపికైనట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య(Handball Association General Secretary Chinthakayala Pullaiah) తెలిపారు. ఈనెల 22 నుండి 26 వరకు ఝార్ఖండ్ రాష్ట్రంలోనే రాంచి లో జరిగే జాతీయస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ కు క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు.