calender_icon.png 1 October, 2024 | 4:59 AM

గుగ్గురువులు.. ఈ పిలక-గిలక

01-10-2024 03:03:08 AM

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి మహామహులు ఇందులో భాగమవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు పాత్రల పరిచయ పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్.. సోమవారం పిలక అనే పాత్రలతో అలరించనున్న బ్రహ్మానందం, సప్తగిరి లుక్ పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో వదిలారు. తాజా పోస్టర్‌లో ఇద్దరు కమెడియన్లు చెట్టు చాటు నుంచి చూస్తూ ఆకట్టుకుంటున్నారు.

‘చేపకి ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..?’ అంటూ పోస్టర్‌పై రాసి ఉండటం చూస్తుంటే పిలక, గిలక పేర్లతో హాస్యనట ద్వయం గురుశిష్యులుగా అలరించనున్నట్టు తెలుస్తోంది.