ఇంటర్ బోర్డు కార్యదర్శిని కోరిన అధ్యాపకులు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్‌ను పొడిగించి వారిని మల్టీజోన్‌లో ఎక్కడ అవకాశం ఉన్నా కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సురేష్ కోరారు. ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శిని గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బదిలీల్లో డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు తిరిగి వేరే కళాశాలకు అవకాశం కల్పించాలని, సాధారణ బదిలీల్లో అవకాశం రాని అధ్యాపకులకు దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రజియా సుల్తానా, లింగమూర్తి, గణపతి, రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.