జిల్లా కలెక్టర్ కు వినతి...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఉన్న గుడిపల్లి లేమూరు ఎమ్మెల్యే కాలనీలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2500 పైగా జనాభా కలిగి 10 వార్డులు, రెండు బూతులు ఉన్నాయనీ అన్నారు. 89,90 రెండు బూతులలో కలిపి సుమారు 1700 ఓటర్లు ఉన్నారనీ అన్నారు. గతంలో లేమూరు గుడిపల్లి అనే గ్రామం ఉండగా వెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఉందని ప్రస్తుతం లేమూరు, గుడిపల్లి, ఎమ్మెల్యే కాలనీ కలుపుకొని 5 వార్డులు ఉన్నాయనీ సుమారు 1000 పైగా జనాభా ఉందన్నారు. గుడిపల్లి పోలింగ్ బూతు నెంబర్ 89లో 600 పైగా ఓటర్లు ఉండగా మండలంలోనే అతిపెద్ద రెవెన్యూ శివారుగా లేమూరు ఉందని వారు వివరించారు.
అతిపెద్ద రెవెన్యూ శివారు అయిన లేమూర్ ను గుడిపల్లి, ఎమ్మెల్యే కాలనీతో కలిపి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోనె రఘువీర్, వంజరీ వెంకటేష్, గంజి రాజేష్, పెద్ది మల్లేష్, వేల్పుల చిరంజీవి, వేల్పుల సాగర్, కూన స్వామి, పెరుమండ్ల రాజయ్య, మాసు కిరణ్, గోనె సుగుణాకర్ రావు, మనుబోతుల రమేష్, మేకల శంకర్, సిద్ధన లక్ష్మణ్, మెరుగు తిరుపతి, సుర్మిల రామకృష్ణ, మేరుగు సాయి, రామగిరి మహేందర్, సిద్ధన లక్ష్మణ్, సిద్దెన మల్లేష్, రోక్కుల రాజు, మాసు రమేష్ మాస్ భీమేష్, నీరటి స్వామి, సల్లూరి రమేష్ లు పాల్గొన్నారు.