calender_icon.png 22 January, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిపల్లి, లేమూర్ లను నూతన పంచాయతీగా ప్రకటించాలి

21-01-2025 08:02:14 PM

ఆర్డీఓ తహశీల్దార్ లకు వినతిపత్రాలను అందజేసిన గ్రామస్తులు...

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఉన్న గుడిపల్లి, లేమూరు, ఎమ్మెల్యే కాలనీలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ మంచిర్యాల ఆర్డీఓ, మండల తహశీల్దార్ లకు మంగళవారం వేరు వేరుగా వినతిపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2500 పైగా జనాభా కలిగి 10 వార్డులు, రెండు పోలింగ్ బూతులున్నాయన్నారు. 89,90 రెండు పోలింగ్ బూతులలో కలిపి సుమారు 1700 ఓటర్లు ఉన్నారన్నారు. ప్రస్తుతం లేమూరు, గుడిపల్లి, ఎమ్మెల్యే కాలనీ కలుపుకొని 5 వార్డులు ఉన్నాయనీ సుమారు 1000 పైగా జనాభా ఉందన్నారు. గుడిపల్లి పోలింగ్ బూతు నెంబర్ 89 లో 600 పైగా ఓటర్లు ఉండగా మండలంలోనే అతిపెద్ద  రెవెన్యూ శివారుగా లేమూరు ఉందని వారు వివరించారు. అతిపెద్ద రెవెన్యూ శివారు ఉన్న లేమూర్ ను గుడిపల్లి, ఎమ్మెల్యే కాలనీతో కలిపి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వంజరీ వెంకటేష్, వేల్పుల సాగర్, పెద్ది మల్లేష్, గోనె సుగుణాకర్ రావు, మెరుగు తిరుపతి, మనుబోతుల రమేష్, సిద్ధన లక్ష్మణ్, సురిమిల్ల రామకృష్ణ, కాపురపు బానయ్య, మేరుగు సాయిలు పాల్గొన్నారు.