calender_icon.png 20 October, 2024 | 5:07 AM

కాంగ్రెస్ నేతల్లో గుబులు

20-10-2024 01:14:07 AM

రేవంత్ సర్కార్ చేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటోంది. రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతున్న బీఆర్‌ఎస్, బీజేపీలకు అస్త్రాలు చేతికందిస్తోంది. గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలపై అధికారం పార్టీపై పోరు చేసేందుకు ఈ రెండు పార్టీలు  ఒకటైనట్లు శనివారం సచివాలయ ముట్టడితో బయటపడింది.

రేవంత్ ప్రభుత్వానికి ఏడాది కావస్తుండటంతో బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ముందుస్తుగా కమలనాథులతో స్నేహం చేసేందుకు సిగ్న ల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒకేరోజు సచివాలయ ముట్టడిని రెండు పార్టీలు చేపట్టడం..

కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజ య్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించడం, అదేసమయంలో బీఆర్‌కే భవన్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, దాసోజ్ శ్రవణ్, శ్రీనివాస్‌గౌడ్  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ఇద్దరిది చీకటి ఒప్పందమనేది తేలిపోయింది. వీరిద్దరి మధ్య చీకటి బంధం ఎప్పటివరకు కొనసాగుతుందోనని కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టిస్తోంది.