11-03-2025 11:10:40 PM
లారీల బియ్యం దించుకోకపోవడంతో అవస్థలు పడుతున్న డ్రైవర్ లు..
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గోదాముల వద్ద ఇబ్బందులు..
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ సెంట్రల్ వేర్ హౌస్ గోదాములలో లారీలల్లో వచ్చిన బియ్యం లోడులను దించుకోవాల్సిన అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. రెండు రోజులుగా లారీల్లో బియ్యం లోడు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు. ఎఫ్సిఐ గోదాములలో నిల్వ ఉంచుకోవాల్సిన అధికారులు కొత్త గోదాములలో నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్తూ బియ్యం లోడుతో ఉన్న లారీలను నిలిపివేశారు. దీంతో లోడు దించకుండా ఎఫ్సిఐ గోదాముల ఎదుట లారీ లోడులతో డ్రైవర్లు నిరీక్షిస్తున్నారు.
ఈ విషయంపై ఎఫ్సీఐ గోదాం ఇన్చార్జి మేనేజర్ రమేష్ గౌడ్ ను వివరణ కోరగా కొన్ని పనులు జరుగుతున్నందున బియ్యం నిల్వతో వచ్చిన లారీల లోడులలో దింపుకోవడం లేదని తెలిపారు. కొన్ని లారీల లోడులను దింపుకున్నామని మరికొన్ని లోడ్లు దింపాల్సి ఉన్నాయని ఆయన తెలిపారు. సకాలంలో బియ్యం లారీ లోడ్లను దింపకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోయారు.