11-02-2025 12:00:00 AM
విరాజ్‌రెడ్డి చీలం హీరోగా జగ పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయరెడ్డి నిర్మించిన చిత్రం ‘గార్డ్’. రివేంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయబోతోన్నారు. సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయడం విశేషం. హారర్, థ్రిల్లర్, లవ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ సోమవారం మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విరాజ్‌రెడ్డి చీలం మాట్లాడుతూ.. “గార్డ్’ కోసం చాలా కష్టపడ్డాం. సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ చేసిన బీనా లేడీ బాస్ టైపులో ఉంటారు. సందీప ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రణయ్ మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిద్ధార్థ్ బీజీఎం గురించి అందరూ మాట్లాడుకుంటారు. మా సినిమాకు దర్శకుడు జగ పెద్ది నుంచి చాలా నేర్చుకున్నాను.
ఈ సినిమాలో ఏ ఒక్కరూ కొత్త యాక్టర్ అన్న ఫీలింగ్ రాదు. అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. చిన్న చిత్రాలను అందరూ సపోర్ట్ చేయండి” అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ.. “గార్డ్’ పాటలు అద్భుతంగా ఉంటాయి. లవ్ స్టోరీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని చెప్పారు.