calender_icon.png 16 January, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను అమలు చేయాలి

12-07-2024 12:03:06 AM

ముదిరాజ్ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలి 

ప్రభుత్వానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి విజ్ఞప్తి

గజ్వేల్, జూలై 11: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్ కోరారు. హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీ నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను గజ్వేల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను ఆర్థికంగా ఆదుకునేందుకు ముదిరాజ్ కార్పొరేషన్‌కు ప్రతి ఏటా రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ముదిరాజ్‌లను బీసీd నుంచి బీసీధి మార్చా లని, జీవో 6 ప్రకారం చెరువులు, కుంటల్లో చేపలు పట్టేందుకు సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరారు. తెలంగాణ మత్స్యకా ర బోర్డు ఏర్పాటు చేసి ముదిరాజ్‌లనే చైర్మన్‌గా నియమించాలని అన్నారు. కార్యక్రమం లో నాయకులు తలారి బిక్షపతి, కొంటెమైన నర్సింహులు, జీర రాజు, నరేశ్, రొట్టెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.