కేజీకేఎస్ డిమాండ్
సూర్యాపేట, నవంబర్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం సూర్యా పేట జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగురి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. సంవత్సంలో 5 వందల మందికి పైగా తాడి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారి మృతి చెందడం, గాయాలపాలు కావడం జరుగుతుందన్నారు. ఈ వృత్తిలో జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కోరారు.