11-12-2024 01:44:43 AM
* పీవోడబ్ల్యూ నాయకురాలు ఝూన్సీ డిమాండ్
ఖమ్మం, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఎన్నికలప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడ బ్ల్యూ) జిల్లా నాయకురాలు ఝూన్సీ అన్నా రు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్ల ను ఆణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం ఆశా వర్కర్లతో చర్చించి, వారి సమస్య లు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి, ప్రతాపనేని శోభ, లలిత, స్వాతి, చైతన్య, పూలమ్మ, వసుమతి, పరిమళ పాల్గొన్నారు.