calender_icon.png 11 October, 2024 | 1:56 AM

ఆలస్యమైనా జాబ్ గ్యారెంటీ

27-08-2024 12:00:00 AM

ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ సీఈవో శుభవార్త

న్యూఢిల్లీ, ఆగస్టు 26: నూతన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలకు ఎంపిక చేసుకొని ఏండ్లు గ డుస్తున్నా విధుల్లోకి తీసుకోకపోవటంపై వస్తున్న విమర్శలకు ఇన్ఫో సిస్ సీఈవో సలీల్ ఫరేక్ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. ‘మా కంపెనీలో ఉద్యోగం కోసం ఎంపికైన ప్రతి వ్యక్తికి కచ్చితంగా జాబ్ ఇస్తాం. కొన్ని సర్దుబాట్ల కారణంగా విధుల్లోకి చేరే తేదీని మాత్రమే మారుస్తున్నాం. అంతేకానీ వారికి ఉద్యోగాలు నిరాకరించబోము’ అని వెల్లడించారు. 2022 విద్యా సంవత్సరంలో ఇ న్ఫోసిస్ రెండువేల మంది కొత్త గ్రా డ్యుయేట్లను ఉద్యోగాలకు ఎంపిక చే సింది. కానీ, వారిని ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ అంశంపై ని రుద్యోగులు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టె క్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) కు ఫిర్యాదు చేయటంతో, ఆ సంస్థ కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్లిం ది. దీంతో ఇన్ఫోసిస్ స్పందించింది.