15-03-2025 12:39:41 AM
మంథని మార్చి 14 (విజయ క్రాంతి): శుక్రవారం ఆకస్మికంగా మంథనికి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామి ని లక్ష్మీపురం ప్రజలు కలిశారు. తమ గ్రామం బస్ స్టాప్ వద్ద బస్ షెల్టర్ లేక బస్ కొరకు ఎండలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఉందని తెలిపారు. ప్రజలు వేచి ఉండడానికి ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
వెంటనే స్పందించిన వివేక్ వెంకటస్వామి బస్సు షెల్టర్ నిర్మాణం కోసం ఎస్టిమేట్ కాపీ వేసుకొని అందజేయవలసిందిగా తెలియజేశారు. తాము కోరిన వెంటనే బస్సు షెల్టర్ నిర్మాణానికి అంగీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి లక్ష్మీపురం ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.