భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో శనివారం రాత్రి పిడుగు పడి జీ టి (జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్) దగ్ధ్దమై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. యూనిట్‌లో తయారైన విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేయడానికి ఈ ట్రాన్స్‌ఫార్మర్ దోహదపడు తుంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ఒకటో యూనిట్‌ను ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.
ఘటన స్థలానికి సీఈ బిచ్చన్న, ఎస్‌ఈలు చేరుకొని వివరాలు సేకరిస్తు న్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనలో జెన్‌కోకు సుమారు రూ.100 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం తో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.