calender_icon.png 2 April, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ లక్ష్యం 88,463 కోట్లు

20-03-2025 02:11:42 AM

  1. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు రూ. 19,087 కోట్లు
  2. ఎక్సైజ్ శాఖకు రూ. 27, 623 కోట్లు

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని రాబట్టేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తెచ్చే శాఖలకు టార్గెట్‌ల ను విధించింది. మొత్తం రెవెన్యూ రాబడులు రూ.2. 29లక్షల కోట్లు కాగా.. అందులో జీఎస్టీకి రూ.88,463.90 కోట్లుగా లక్ష్యాన్ని నిర్దేశించింది. 2024-25లో ఈ శాఖకు 79,0245 కోట్లను ప్రభుత్వం ఆర్జించింది.

ఆదాయాన్ని తెచ్చే మరో ప్రధాన శాఖ ఎక్సైజ్ విభాగానికి రూ.27,623.36 కోట్లను టార్గెట్‌గా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 25, 617 కోట్లను ప్రభుత్వం ఆబ్కారీ శాఖ ద్వారా ఆర్జించింది. కీలకమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం రూ.19,087 కోట్లు, వాహనాలపై పన్ను ద్వారా రూ.8,535 కోట్లను 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆశిస్తోంది.