calender_icon.png 27 September, 2024 | 9:42 AM

25న జీఎస్టీ రేట్ల కమిటీ సమావేశం

23-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించేందుకు పన్ను రేట్లను సమీక్షించేందుకు  జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూప్ (జీవోఎం)ను సెప్టెంబర్ 25న సమావేశం కానుంది. గోవాలో జరిగే ఈ సమావేశంలో పన్ను రేట్లను, శ్లాబుల్ని చర్చిస్తారని కేంద్ర అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులుగల ఈ కమిటీ గత ఆగస్టులో ఒక దఫా సమావేశమై సెప్టెంబర్ 9న కౌన్సిల్‌కు స్టాటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్టీ పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలకు పన్నును మినహాయించడమో లేదా కనిష్ఠశ్లాబ్‌లో పన్ను వసూలు చేస్తుండగా, లగ్జరీ, డీమెరిట్ ఐటెమ్స్‌కు గరిష్ఠ శ్లాబ్‌లో పన్ను రేటు ఉన్నది. 

12,18 శాతం పన్ను శ్లాబ్‌ల్ని విలీనం చేసే యోచన

ప్రస్తుతం అమలులో ఉన్న 12, 18 శాతం శ్లాబుల్ని విలీనం చేయాలన్న చర్చలు జరుగుతున్నప్పటికీ, అం దుకు సంబంధించిన ప్రతిపాదన కౌ న్సిల్ ముందుకు రాలేదు. ఈ విధం గా 18 శాతం రేటును 12 శాతం శ్లాబ్ లో కలిపితే రెవిన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతంలోపునకు తగ్గుతుం ది. ఈ కారణంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు జీఎస్టీ శ్లా బ్స్‌ను మార్చడానికి సానుకూలంగా లేవు.