- త్వరలో తెలంగాణలో డిజిటల్ విధానం అమలు
- యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్
- పోర్టల్‌లో మార్పులు చేసే పనిలో జీఎస్టీఎన్
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో జీఎస్టీ చెల్లింపుదారులకు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసేం దుకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) సిద్ధమవుతున్నది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించనున్నది.
తద్వా రా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు పనిభారం తగ్గించు కోవడం ఆ శాఖ ధ్యేయం. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖతో జీఎస్‌టీఎన్ సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలిసిం ది. డిజిటల్ పేమెంట్స్‌కు అనుకూలంగా జీఎస్టీ పోర్టల్‌ను మారుస్తున్నట్లు సమాచారం.
22 రాష్ట్రాల్లో అమలు..
యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జీఎస్టీని చెల్లించే విధానం ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో అమలవుతోంది. ఈ నెల 7న తమిళనాడులో డిజిటల్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. త్వర లో తెలంగాణలో ప్రారంభించేందుకు జీఎస్టీఎన్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఒకేసారి ఈ విధానాన్ని ప్రారంభించే ఆలోచనలో వస్తువులు, సేవల పన్నుల నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది నుంచే..
జనవరి 5న తొలిసారి యూపీఐ, క్రెడిట్, డెబి ట్ కార్డుల ద్వారా జీఎస్టీ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ పద్ధతిలో పేమెంట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 10 రాష్ట్రాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను షురూ చేసింది. తర్వాత క్రమక్రమంగా మిగిలిన రాష్ట్రాలకూ విస్తరింపజేస్తున్నది.
వినియోగదారు లు మాస్టర్ కార్డ్, వీసా, డైనర్, రూపే కార్డుల ద్వారా జీఎస్టీ చెల్లించే వెసులుబాటు ఉంది. కొన్నిరాష్ట్రాల్లో కొటక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సి స్, కెనరా, కర్ణాటక బ్యాంకు కార్డులతో జీఎస్టీ చెల్లింపులకు అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిన నేపథ్యంలో అవే బ్యాంకులు ఉంటాయా? లేదా వాటినే జీఎస్టీఎన్ కొనసాగిస్తుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది.
తగ్గనున్న పనిభారం..
ఇప్పటివరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపీఎస్) పద్ధతిలోనే జీఎస్టీ చెల్లింపులు ఉండేవి. ఇక నుంచి యూపీఐ, కార్డులతోనూ చెల్లించే సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఇప్పటివరకు వ్యాట్‌కు మాత్రమే యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంది. జీఎస్టీ చెల్లింపులు సైతం డిజిటల్ మోడ్‌లోకి వస్తే వినియోగదారులు సునాయాసంగా చెల్లింపులు చేయనున్నారు. తద్వారా తమకు పనిభారం కూడా తగ్గుతుందని వాణిజ్య పన్నుల (ఐటీ)శాఖ వెల్లడిస్తున్నది.