calender_icon.png 26 November, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ కొత్త రిజిస్ట్రేషన్లు 30వేలు

11-10-2024 02:12:38 AM

6 నెలల్లో సెంట్రల్ పరిధిలో 6.2 శాతం వృద్ధి

రాష్ట్ర పరిధిలో 3.7శాతం పెరుగుదల

2024-25 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు నమోదైన జీఎస్టీఐఎన్‌ఎస్ వివరాలను వెల్లడించిన కేంద్రం

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య రిజిస్టరైన జీఎస్టీఐఎన్‌ఎస్‌ల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఈ ఆరు నెల్లలో తెలంగాణలో కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్లు 30,713 పెరిగినట్లు పేర్కొంది.

వీటిలో కేంద్ర జీఎస్టీ పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. రాష్ట్ర పరిధిలో  కొత్తగా 15,587 నమోదు కాగా.. కేంద్ర పరిధిలో 15,587 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే 2023-24 ఏప్రిల్  పోలిస్తే.. ఈ ఏడాది స్టేట్ కన్నా.. సెంట్రల్ జీఎస్టీలో వృద్ధిరేటు భారీగా పెరిగింది. రాష్ట్ర పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది రూ.3.7శాతం వృద్ధి నమోదు అయితే.. కేంద్ర పరిధిలో 6.2శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 

ఒకేదేశం.. ఒకే పన్ను

ఒకే దేశం ఒకే పన్ను విధానంతో 2017లో కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో అంతకుముందు పరోక్ష పన్ను కట్టే వారిని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఈ క్రమంలో జీఎస్టీని మూడు విధాలుగా విభజించింది. ఒకటి స్టేట్ జీఎస్టీ, రెండోది సెంట్రల్ జీఎస్టీ, మూడో ఐజీఎస్టీ.

రాష్ట్ర పరిధిలో లావాదేవీలు జరిపే వారిలో కొందురు సెంట్రల్ జీఎస్టీ, మరికొందరు స్టేట్ జీఎస్టీ పరిధిలో ఉంటారు. అంతర్రాష్టాల మధ్య వ్యాపారం చేసే వారు ఐజీఎస్టీ పరిధిలోకి వస్తారు. కొత్త వ్యాపారస్తులు రావడం జీఎస్టీ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో గత ఆరు నెలల్లో కొత్తగా 30,713 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కేంద్రం చెప్పింది.

దేశంలో 8.22 లక్షల రిజిస్ట్రేషన్లు

దేశం మొత్తంలో కొత్తగా 8.22లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో తెలంగాణ వాటా కేవలం 3.73శాతమే కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కొత్తగా 78,267 నూతన జీఎస్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.

అత్యల్పంగా మేఘాలయలో గతేడాదితో పోలిస్తే భారీగా(-11.9) తగ్గాయి.  మరో తెలుగు రాష్ట్రం ఏపీ విషయానికి వస్తే.. అక్కడ కొత్తగా 22,542 జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇవి గతేడాది కంటే 2.9శాతం ఎక్కువ కావడం గమనార్హం.

తెలంగాణ మొత్తం 

రిజిస్ట్రేషన్లు

మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్లు 5,32,503 

కొత్తగా ఏప్రిల్-సెప్టెంబర్ 30,713

రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర సగటు వృద్ధి రేటు 4.9శాతం

సెంట్రల్ జీఎస్టీ 

మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషను 2,23,574

కొత్తగా ఏప్రిల్-సెప్టెంబర్ 15,127

రిజిస్ట్రేషన్లు

వృద్ధి రేటు 6.2శాతం

స్టేట్ జీఎస్టీ 

మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్లు 3,08,929 

కొత్తగా ఏప్రిల్-సెప్టెంబర్ 15,587 

రిజిస్ట్రేషన్లు

వృద్ధి రేటు 3.7శాతం