calender_icon.png 12 January, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు

02-12-2024 12:00:00 AM

8 శాతం వృద్ధి 

ముంబై, డిసెంబర్ 1: నవంబర్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) స్థూల వసూళ్లు 8.5 శాతం వృద్ధిచెంది రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. నిరుడు ఇదే నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. అధిక దేశీయ లావాదేవీల కారణంగా ఈ నవంబర్ వసూళ్లలో వృద్ధి సాధ్యపడింది. అయితే 2024 అక్టోబర్‌లో వసూలైన రూ.1.87 లక్షల కోట్లకంటే నవంబర్‌లో తగ్గడం గమనార్హం.

మొత్తం వసూలైన పన్నుల్లో రూ.43,047 కోట్లు స్టేట్ జీఎస్టీకాగా, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ ద్వారా రూ.91,828 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. సెస్ రూపంలో రూ.13,253 కోట్లు వసూలైనట్లు ఆదివారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడయ్యింది. 2024 నవంబర్‌లో దేశీయ లావాదేవీల ద్వారా వసూలైన జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరింది.

దిగుమతులపై పన్ను ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.42,591 కోట్ల వద్ద నిలిచింది. ఈ నెలలో రూ.19,259 కోట్ల రిఫండ్స్ జారీచేయగా, నికర జీఎస్టీ వసూళ్ళు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు పెరిగాయి.