calender_icon.png 11 October, 2024 | 5:52 AM

జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు

02-10-2024 12:00:00 AM

సెప్టెంబర్ నెలలో 6.5 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్ నెలలో 7.5 శాతం వృద్ధిచెంది రూ. 1.73 లక్షల కోట్లకు పెరిగినట్లు మంగళవారం కేంద్రం విడుదల చేసిన గణాంకా లు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఆగస్టులో నమోదైన రూ.1.75 లక్షల కోట్లకంటే సెప్టెంబర్‌లో తగ్గాయి. నిరుడు సెప్టెంబర్‌లో ఈ వసూళ్లు రూ. 1.63 లక్షల కోట్లు. తాజాగా ముగిసిన నెలలో దేశీయంగా జీఎస్టీ వసూళ్లు 5.9 శాతం పెరిగి  రూ. 1.27 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల ద్వారా పన్నుల ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 45,390 కోట్లకు చేరింది. రూ.20,458 కోట్ల రిఫండ్స్ పోను 2024 సెప్టెంబర్‌లో నికరంగా రూ.1.53 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.