calender_icon.png 7 October, 2024 | 9:54 PM

జీఎస్టీ వసూళ్లు రూ.1.75 లక్షల కోట్లు

02-09-2024 12:00:00 AM

ఆగస్టులో 10 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ముగిసిన ఆగస్టు నెలలో వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు నిరుడు ఇదేనెలతో పోలిస్తే 10 శాతం పెరిగి రూ.1.75 లక్ష ల కోట్లకు చేరాయి. ఆదివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 జూలైకంటే ఆగస్టులో వసూళ్లు తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో ఈ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది జూలైలో ఇవి రూ.1.82 లక్షల కోట్లు. ఈ ఆగస్టులో దేశీయంగా జీఎస్టీ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల ద్వారా స్థూల జీఎస్టీ ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్ల వద్ద నిలిచింది. ఇదే నెలలో రిఫండ్స్ భారీగా 38 శాతం పెరిగి రూ.24,460 కోట్లకు చేరుకున్నాయి. రిఫండ్స్‌పోను నికర జీఎస్టీ ఆ దాయం 6.5 శాతం వృద్ధితో రూ.1.5 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 

తెలంగాణలో 7 శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఈ ఆగస్టు నెలలో 7 శాతం వృద్ధిచెంది రూ. 8,437 కోట్లకు చేరాయి. నిరుడు ఇదేనెలలో రూ. 7,909 కోట్ల జీఎస్టీ పన్నులు తెలంగాణలో వసూలయ్యాయి.