హైదరాబాద్: అక్టోబరు నెలలో తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. అక్టోబరులో వ్యాట్, జీఎస్టీ రూ. 470 కోట్ల పెరుగుదలను నమోదు చేశాయి. గతేడాది అక్టోబరులో కంటే 8 శాతం అధిక ఆదాయం వచ్చింది. వ్యాట్, జీఎస్టీ రాబడులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే రూ. 840 కోట్లు తగ్గాయి. పెట్రోల్ అమ్మకాలు పడిపోవడంతో వ్యాట్ రాబడులు భారీగా తగ్గాయి.