24-02-2025 12:55:07 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి ): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం యాదగిరిగుట్టలో ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రారంభించిన స్వామివారి దివ్య విమాన స్వర్ణ గోపురం. స్వర్ణ కాంతులను వెదజల్లుతుంది. దేశంలోని దేవాలయాల అన్నింటికీ తల మాణికం.
ఇంతటి దేదీప్యమైన ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం దాతలు జె ఎస్ ఆర్ సన్ సిటీ చైర్మన్ డాక్టర్ జడ పెల్లి నారాయణ గౌడ్ దంపతులు. 50.5 అడుగుల ఎత్తు... 10,759 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉన్న విమాన స్వర్ణ గోపురానికి రూ. 80 కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి రూపొందించారు.
ఈ గోపురం దేశంలోనే ఎత్తునదిగా రికార్డు నెలకొన్నది. గోపురంపై నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి గరుడమూర్తుల ఆకారాలను చూసి భక్తులు భక్తి భావంతో తన్మయత్వం చెందుతున్నారు.