11-04-2025 09:48:05 PM
జకరయ్య..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం కేంద్రంగా ఉన్న జి ఎస్ ఎల్ సి సొసైటీ ఆస్తులు నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని జిఎస్ఎల్సి మాజీ కోశాధికారి జకరయ్య జిఎస్ఎల్సి ఈ వ్యవస్థాపకుల సతీమణి శ్యామల రాణి కూతురు ధనలక్ష్మి ఆరోపించారు. భద్రాచలం పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జి.ఎస్.ఎల్.సి సొసైటీ కి చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ఆస్తులను అక్రమంగా అమ్ముతున్నారని ఇది చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. గతంలో కూడా సొసైటీ అభివృద్ధి, నిర్వహణ కోసమని కోట్లాది విలువచేసే భూములు అమ్మారని వారు ఆరోపించారు.
సొసైటీ సభ్యులకు ఎవరికి తెలియకుండా వేలాది రూపాయలు విలువచేసే సొసైటీ ఆస్తులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరుతో అమ్మకాలు చేస్తున్నందున ఎవరు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఇప్పటికే అతను మాయ మాటలు చెప్పి కోట్లాది రూపాయలు ఆస్తులు విక్రయించారని, భవిష్యత్తులో కూడా అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం వాసులతో పాటు ఇతర ప్రాంతాలు వారు కూడా ఎవరు సొసైటీ ఆస్తులు కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు.