05-03-2025 12:00:00 AM
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): దేశ సహజ ఖనిజ వనరులను గుర్తించడంలో, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించడంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా (జీఎస్‌ఐ) అద్భుత పాత్ర పోషించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి కొనియాడారు.
మంగళవారం కోల్‌కతాలోని జీఎస్‌ఐ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్‌లో జరిగిన జీఎస్‌ఐ 175వ ఆవిర్భావ దినో త్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వప్నమైన వికసిత భారత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం, క్రిటికల్ మినరల్స్ అన్వేషణతో పాటు అనేక ఆధునాతనమైన ప్రాజెక్టులను జీఎస్‌ఐ చేపట్టిందన్నారు.
ఆత్మనిర్భర భారత్‌లో లక్ష్యాలను చేరడంలో జీఎస్‌ఐ 175 ఏళ్ల నైపుణ్యత, ఆధునిక సాంకేతికత, ప్రగతిశీల వ్యూహాలు ఎంతగానో దోహదపడ నున్నాయని తెలిపారు. అంతకముందు చాంబర్ ఆఫ్ కామర్స్ 125వ వార్షికోత్సవాలకు కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టినట్టే మన ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. పదేళ్లలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు.