02-03-2025 02:17:05 PM
సంజీవయ్య పార్కులో మారథాన్
ఎల్బీనగర్: భారతీయ భువైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మార్చి 2న ఉదయం 8 గంటలకు సంజీవయ్య చిల్డ్రన్ పార్క్, ట్యాంక్ బండ్ దగ్గర వాకథాన్ (వాకింగ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వం, గనుల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన భారతీయ భువైజ్ఞానిక సర్వే సంస్థ (జీఎస్ఐ) 1851లో స్థాపించి, ఇప్పుడు 175వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ప్రపంచంలోనే రెండో అతి పురాతన, అతిపెద్ద భువైజ్ఞానిక సర్వే సంస్థ.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జీఎస్ఐ దక్షిణ క్షేత్రం, శిక్షణా సంస్థ ప్రధాన కార్యాలయం సంయుక్తంగా సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వద్ద వాకథాన్ (వాకింగ్) ఈవెంట్ నిర్వహించారు. దేశాభివృద్ధికి జీఎస్ఐ చేస్తున్న సేవ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా వాకింగ్ వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా జీఎస్ఐ దక్షిణ క్షేత్ర కార్యాలయం నిర్వహించిన సేవలపై రాసిన సావనీర్ ను అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ డి పాట్బాజే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వివిధ ఖనిజాలు, శిలలు, శిలాజ ఇంధనాలు, శిలాజాల నమూనాలను స్టాల్ లో ప్రదర్శించారు. వాకథాన్ (వాకింగ్) కార్యక్రమాన్ని సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా స్ఫూర్తి స్థల్ వరకు, తిరిగి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వరకు సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్ మీదుగా స్ఫూర్తి స్థల్ వరకు, తిరిగి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వద్దకు చేరడంతో తో పూర్తయింది. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఐ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల విద్యార్థులు, విద్యావేత్తలు, జియో సైంటిస్టులు, వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వీఆర్వో డాక్టర్ మల్లేశ్ గంజి తెలిపారు.