calender_icon.png 19 November, 2024 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నింగిలోకి జీశాట్-20 శాటిలైట్

19-11-2024 01:13:01 AM

  1. మోసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్
  2. ఫ్లోరిడాలోని కేప్‌కెనరావల్ నుంచి ప్రయోగం

న్యూఢిల్లీ, నవంబర్ 18: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన భారీ శాటిలైట్ జీశాట్-20ను మోసుకుని పోతున్న స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలోని కేప్‌కెనరావల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 4,700 కిలోల బరువున్న ఈ శాటిలైట్ భారత కమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూపొందించారు.

ఇందులో కేఏ-బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్ జీవిత కాలం 14 ఏళ్లు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాటిలైట్‌ను జీశాట్-ఎన్2గానూ వ్యవహరిస్తారు. భారత్ వద్ద ఉన్న రాకెట్ల ద్వారా 4 వేల కిలోల పేలోడ్ వరకు మాత్రమే భరిస్తాయి.

అందువల్ల స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ సహకారంతో ఈ భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించిన తర్వాత మారుమూల ప్రాంతాలతో ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు విమానాల్లోనూ నెట్ సేవలను అందించవచ్చు.