ఒక్కో షేరుకు బోనస్ షేరు
ముంబై : ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,209 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,646 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం రూ.22,516 కోట్ల నుంచి రూ.22,302 కోట్లకు తగ్గినట్లు విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
అర్హులైన వాటాదారులకు ఒక షేరుకు ఒక బోనస్ షేరుగా ఇవ్వాలని కంపెనీ బోర్డు ఈ సందర్భంగా నిర్ణయించింది. అంటే రికార్డు డేట్ నాటికి ఎవరి ఖాతాలో విప్రో షేర్లు ఉంటాయో వారికి ఒక షేరు బోనస్‌గా లభిస్తుంది. రికార్డు తేదీని మాత్రం కంపెనీ వెల్ల డించలేదు.
గతంలోనూ విప్రో ఐదుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. సమీక్షా త్రైమాసికంలో 3.56 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు విప్రో ఈ సందర్భం గా తెలిపింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు విలువ 0.65 శాతం క్షీణించి రూ.528.7 వద్ద ముగిసింది.
ఎల్టీఐ మైండ్‌ట్రీ రూ.20 బోనస్
మరో ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్‌ట్రీ ఏకీకృత నికర లాభంలో 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1251 కోట్ల లాభాన్ని ఆర్జి ంచింది. ఇదే త్రైమాసికంలో ఆదాయంలో 6 శాతం వృద్ధితో రూ.9,433 కోట్లు వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఎల్టీఐ బోర్డు రూ.20 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అక్టోబర్ 25న రికార్డు డేట్‌గా నిర్ణయించింది. నెల రోజుల్లో చెల్లింపులు చేస్తామని కంపెనీ ప్రకటించింది.