- గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరిగిన మోసాలు
- టాప్‌లో డిజిటల్ అరెస్ట్.. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్
- తగ్గుముఖం పట్టిన లోన్ యాప్ వేధింపులు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదికను విడుదల చేసిన డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుగూ.. ఈ సంవత్సరం లో సైబర్ నేరగాళ్ల కోసం మూడు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నేరగాళ్లను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపుతున్నామని, దీంతో నేరగాళ్లను పట్టుకోవడంలో సత్ఫలితాలు సాధ్యమ వుతున్నాయని వెల్లడించారు.
గతేడాది 91,652 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 1,14,174 కేసులు నమోదయ్యాయన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం సైబర్ నేరాలు పెరిగినట్లు వెల్లడించారు. వీటిల్లో బాధితులు సుమారు రూ.2 వేల కోట్ల వరకు కోల్పోయారని వివరించారు. ఈ సంవత్సరం మొత్తం రూ.176 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇప్పించామ న్నారు.
సైబర్ నేరగాళ్ల అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని.. మొత్తం 1,057 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని, వీరంతా తెలంగాణలో నమోదైన 19,653 కేసుల్లో, దేశవ్యాప్తంగా నమోదైన 1,16,421 కేసుల్లో నిందితు లుగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటివరకు 20,677 కార్యక్రమాలను ఏర్పా టు చేశామని శిఖా గోయల్ వెల్లడించారు.
సైబర్ నేరాలకు సహకరిస్తున్న 21 మంది అరెస్ట్
సైైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 21మందిని అరెస్ట్ చేశామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. పట్టుబడిన వారంతా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారుగా పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వారు 13 మంది కాగా, ఏజెంట్లు 8 మంది ఉన్నారు.
వీరంతా సైబర్ నేరాల్లో ఉపయోగించిన బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్మును ఏజెంట్ల సహాయంతో క్రిప్టోగా మార్చి ఇతర దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాలు రాష్ట్రంలో నమోదైన 25 కేసుల్లో, దేశవ్యాప్తంగా నమోదైన 714 కేసుల్లో ఉపయోగిం చినట్లు వివరించారు.
మొత్తం రూ.8.2 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించామన్నారు. వారి నుంచి 20 సెల్‌ఫోన్లు, 15 సిమ్‌కార్డులు, 4 బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌లు, 5 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించామని శిఖా గోయల్ పేర్కొన్నారు.
సందేహాల నివృత్తికి స్పెషల్ డెస్క్
సైబర్ నేరాలపై అవగాహన, సందేహాల నివృత్తి కోసం స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు శిఖా గోయల్ చెప్పారు. ఇందు కోసం డయల్ 1930 ప్రెస్ ఆప్షన్ నంబర్ 4 నొక్కాలని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం అవసరమయ్యే సమర్థవంతమైన టూల్స్ సైబర్ బ్యూరోలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం సైబర్ నేరాల్లో ప్రమేయమున్న 14,185 సిమ్ కార్డులు.. 9,811 ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయడం ద్వారా నేరగాళ్ల మొబైల్స్ పని చేయకుండా చేశామన్నారు. 1,825 యూఆర్‌ఎల్, వెబ్‌సైట్లను బ్లాక్ చేశామన్నారు.
టూరిస్ట్ వీసాలపై అమా యకులను మోసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామమని వెల్లడిం చారు. లోన్ యాప్ వేధింపులు క్రమం గా తగ్గాయని శిఖా గోయల్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.