ముంబై: ఫైనాన్షియల్ సేవలు అందించే గ్రో ప్లాట్‌ఫామ్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు సంబంధిత వ్యక్తులను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. రాబోయే 1012 నెలల్లో ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సంస్థ దేశీయంగా ఐపీఓకు రానుంది. అందులో భాగంగా తొలుత తన హోల్డింగ్ కంపెనీని అమెరికానుంచి భారత్‌కు తరలించాలని భావిస్తున్నట్లు సమా చారం. తరలింపు పూర్తయిన ఏడాదిలోపే ఐపీఓకు రానుంది. ఈ ఫైనాన్షియల్ సేవల సంస్థ ఐపీఓ ద్వారా రూ. 6,058 కో ట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇప్పటికే ఐపీఓ కోసం చర్చలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.