calender_icon.png 10 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల

08-03-2025 12:29:57 AM

ఈ నెల 10న గ్రూప్-1, 11న గ్రూప్-2, 14న గ్రూప్-3 ఫలితాలు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): గ్రూప్స్ పరీక్షల ఫలితాల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 10న గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్ మార్కుల వివరాలను విడుదల చేయనున్నట్లు శుక్రవారం కమిషన్ తెలిపింది. అలాగే ఈనెల 11న గ్రూప్-2, 14న గ్రూప్-3 అభ్యర్థుల జనరల్ ర్యాంకిం గ్ జాబితా విడుదల చేయనున్నట్టు చెప్పింది.

ఈ క్రమంలోనే ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈనెల 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నియామక పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకిగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.

ఫలితాల షెడ్యూల్ విడుదల చేయడానికి టీజీపీఎస్సీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైనట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 563 గ్రూప్-1 ఉద్యోగాలు, 783 గ్రూప్-2, 1365 గ్రూప్-3, 581 వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.