మహబూబ్ నగర్: గ్రూపులకు వివాదాలకు ఎక్కడ తావు లేకుండా, ప్రశాంతమైన అవతారంలో ఎప్పుడు జరిగిన విధంగా ఘనంగా వినాయక చవితి వేడుకలను జరుపుకుందామని, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఆదివారం విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గణేశ్ భవన్ లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం ఉండరాదని, ప్రజలకు ఇబ్బందులు కల్పించకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం డిసెంబర్ 3 నాడే మీకు వచ్చిందని, గ్రూపులు, వర్గాలు చేయరాదని ఆయన సూచించారు.
ఐక్యమత్యం తో సామరస్యంగా ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిష్టతో నియమాలతో గణేష్ మండపాలలో పవిత్రం గా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా మంచి సంకల్పం తో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ నంబరు కోసం వచ్చిన వారికి ఏదైనా ఒక కట్టుబాట్లు చేయాలి అని విశ్వహిందూ పరిషత్ సభ్యులను కోరారు. అందరం ఇక్కడే పుట్టాం ఈ మట్టిలోనే కలిసిపోయే వాళ్ళం కాబట్టి కుల మతాలకు అతీతంగా కలిసి కట్టుగా పండుగలు, పర్వదినాలు జరుపుకోవాలని ఆయన యువతను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మద్ది యాదిరెడ్డి, లక్ష్మణ్ యాదవ్, సుధాకర్ రెడ్డి, గోపాల్ యాదవ్ , అబ్దుల్ హక్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.