calender_icon.png 12 March, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 2 ర్యాంకర్‌కు సన్మానం

12-03-2025 12:19:11 AM

మహబూబాబాద్.  మార్చ్ 11 (విజయ క్రాంతి ) : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష ఫలితా ల్లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు కాగా గూడూరు మండలం జంగు తండా పంచాయతీకి చెందిన మూడు శ్రీకాంత్ సాధించిన ఫలితం ప్రత్యేకంగా నిలువగా ఇతను ఎస్టి కేటగిరిలో ప్రధమ ర్యాంకు జోనల్ వాయిస్ ఓపెన్ కేటగిరీలో థర్డ్ ర్యాంక్ స్టేట్ వైడ్ 38వ ర్యాంకు సంపాదించడం జరిగింది.

ఈ సందర్భంగా జం గుతాండ పంచాయతీ మాజీ సర్పంచ్ అరు ణ్ మహిళా మాజీ ఎంపీటీసీ గీతా అమరేందర్ రెడ్డి మూడు నరేష్ గ్రామ పెద్దలందరూ మరియు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్ ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న గా గ్రూప్ త్రీ లో కూడా మంచి మార్కులు వచ్చాయని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ప్రతిభను చూసి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.