పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తెలంగాణ బిడ్డ
హైదరాబాద్: పారాలింపిక్స్‌లో పతకం నెగ్గి తెలంగాణ ఖ్యాతిని, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వరంగల్‌కు చెందిన దీప్తి జీవింజి మీద సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ. కోటి రూపాయల నగదుతో పాటు, గ్రూప్ ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుం డా ఆమె కోచ్ నాగపురి రమేశ్‌కు రూ. 10 లక్షల నగదు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పారాలింపిక్స్‌లో దీప్తి మహిళల 400 మీటర్ల టీ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన విషయం తెలిసిందే. అతి పేద కుటుంబంలో జన్మించిన దీప్తి మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్‌గానే పెరిగింది. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ.. ‘కాంస్యం గెలవడం సంతోషంగా ఉంది. స్వర్ణం గెలవడమే నా లక్ష్యం. పోటీ సమయంలో అనారోగ్యంతో ఉండడం వల్ల పసిడికి దూరమయ్యా. భవిష్యత్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తా. ఎనిమిదేళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది’ అని తెలిపింది.
సీతక్క అభినందన
దీప్తి జీవాంజిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. ఆదివారం ప్రజాభవన్‌లో శాట్ చైర్మన్ శివసే నారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యలతో కలిసి దీప్తి జీవాంజి మంత్రి సీతక్కభేటీ అయ్యారు. దీప్తి జీవాంజి, కోచ్ రమేష్‌లను సత్కరించి అభినందించారు.