calender_icon.png 13 January, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

11-12-2024 07:43:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 15 16 తేదీల్లో టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఈ పరీక్షకు 8080 మంది అభ్యర్థులు హాజరు కానుండగా 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని పరీక్షరాస్య అభ్యర్థులు విధులు నిర్వహించి ఉద్యోగులు ఎలాంటి తప్పిదాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. పరీక్షలు రాసి అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఉదయం మధ్యాహ్నం వేళలో రెండు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ పీజీ రెడ్డి, అధికారులు పరశురాం ప్రజలు పాల్గొన్నారు.