calender_icon.png 17 November, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్ష

17-11-2024 06:12:27 PM

55 శాతం మంది పరీక్షకు హాజరు 

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, డీసీపీ

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో జిల్లాలో మొదటిరోజు నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య, కార్మల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఎగ్గడి భాస్కర్ లు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం జరిగిన పరీక్షలో 15 వేల 38 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 8 వేల 304 మంది అభ్యర్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షలో 15 వేల 38 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 8 వేల 246 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 55% అభ్యర్థులు హాజరయ్యాని తెలిపారు.

ఈ పరీక్షలను నోడల్ అధికారి, పోలీస్ నోడల్ అధికారి, రీజియన్ కో-ఆర్డినేటర్ లతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, శాఖ అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, రూట్, జాయింట్ రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందని, త్రాగునీరు, మూత్రశాలలు, నిరంతర విద్యుత్ సరఫరా ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగాయన్నారు. మొబైల్ ఫోన్లు, పేజర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యులేటర్, ఎనలాగ్, డిజిటల్ గడియారాలు, బ్లూటూత్ లను లోపలికి అనుమతించలేదన్నారు.

హాల్ టికెట్, వెరిఫికేషన్ కొరకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గ్రూప్-3 పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 12:30 గంటలు వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం గదిలోనే ఉండాలని, పరీక్ష రాసిన అనంతరం ఓ.ఎం.ఆర్. షీట్ లను ఆయా ఇన్విజిలేటర్లకు అందించి పరీక్ష ప్రశ్నాపత్రమును తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.