నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన గ్రూప్-3 రెండో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరిశీలన నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించి పరిశీలన నిర్వహణ పర్యవేక్షణను చేశారు. ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల పలు పరీక్షా కేంద్రాలు సందర్శించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.