నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 8124 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా వందమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పరీక్ష నిర్వహించగా అన్ని పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి పరీక్షల నిర్వహణను పగడ్బందిగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.