calender_icon.png 17 November, 2024 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటిష్ట బందోబస్తు మధ్య గ్రూప్ పరీక్షలు

17-11-2024 08:01:24 PM

కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో గ్రూప్-3 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 10 గంటలకు ఉండగా అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8:30 నుంచి అభ్యర్థులను పరీక్ష సెంటర్లకు బయెమెట్రిక్ తీసుకోని అనుమతించారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్లు కాగా, కాగజ్ నగర్ 9 సెంటర్లు ఆసిపాబాద్ లో 9 సెంటర్ లో మొత్తం 4471 మంది అభ్యర్థులకు గాను ఉదయం పూట 2794 మందికి హజరు గాకా 1677 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 5:30 గంటల వరకు జరిగిన పరీక్షకు గాను 4471 మందికి గాను 2779 మంది హజరు కాగా, 1692 గైర్హాజరు కాగా, 62 శాతం హాజరు నమోదయింది.

పరీక్ష కేంద్రాల తనిఖీ...

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ తో పాటు పలు సెంటర్లను ఎస్పీ శ్రీనివాస రావు సందర్శించి పరీక్ష సెంటర్లలో ఏర్పాటు చేసిన పటిష్టమైన బందోబస్తుగా ఉండాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పరీక్ష అనంతరం పరీక్ష ఓఎంఆర్ షీట్స్ స్ట్రాంగ్ రూం తరలింపు పోలీస్ సిబ్బంది తగు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ, పీటీజీ గురుకుల పాఠశాల సెంటర్లను తనిఖీ చేశారు.పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీ నరసింహ, రూట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.