సీఎంకు లేఖ రాసిన ఎస్సీ విద్యార్థులు
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ విద్యార్థులు లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చే యాలని కోరారు. జరిగిన, జరగబోయే ఉద్యోగ పోటీ పరీక్షల్లో ఎస్సీ వర్గీక రణను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
వర్గీకరణ అమలులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం జస్టిస్ షమీం అక్తర్ నేతృ త్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాలకు గొప్ప అవకాశం వర్గీకరణ అని పేర్కొన్నారు. రా ష్ట్రంలో వర్గీకరణ జరిగిన తర్వాతనే నవంబ ర్, డిసెంబర్‌లో జరిగే గ్రూప్-2,3 పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఈ లేఖను మంత్రులు, టీజీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీలు కోదండరామ్, తీన్మార్ మల్లన్నకు పంపించారు.